నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం: స్థానిక 46 డివిజన్ పరిధిలోని జూబ్లీపురలోని అంగన్ వాడి కేంద్రాలలో ఈరోజు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పోరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్నకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తుందని పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడి సిబ్బంది సహకరిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. చిన్నపిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు సంస్కారం మరియు ఆహారపు అలవాట్లు మిగతా పోషణ సంబంధిత విషయాలు నేర్పబడతాయి. కావున పిల్లలని అంగన్వాడి కేంద్రాలకు పంపడం ద్వారా వారి భవిష్యత్తు కు బంగారు మాటలు వేసినట్లు అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సంధ్య, హెల్పర్ జయలక్ష్మి స్థానిక మహిళలు బర్మ పెంటమ్మ, మిరియాల లక్ష్మమ్మ, గొట్టిపార్తి నవ్య, సుధగాని రాధిక, బండ పుష్పావతి, షేక్ ఖాసీంబి తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలలో అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ కన్నం వైష్ణవి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

