నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్: మండల పరిధిలో రోజు అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది కలప వ్యాపారులు అక్రమ సంపాదన ధ్యేయంగా ఇష్టారీతిగా చెట్లను నరికి ఇటుక బట్టీలకు,టింబర్ డిపోలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొంతమంది అటవీ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకొని వాల్టా చట్టానికి చరమగీతం పాడుతున్నారు. మండలం పరిధిలో వేలాది చెట్లు ఇటుక బట్టీలకు సామిల్ టింబర్ డిపోలకు తరలుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అడవులు, వీరి కంటినపడితే ఖతమైనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రూరల్ మండలంలోని మంగళ గూడెం పోలిశెట్టి గూడెం మద్దివారిగూడెం తీర్థాల తనగంపాడు కస్నా తండా గురుడుపాడు ప్రాంతాల్లో రోజుకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని కలపను అక్రమ వ్యాపారులు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్ కలప విలువ సన్న కర్ర అయితే రూ. 15 నుంచి రూ.20 వేలు పలుకుతుంటే, పెద్ద పెద్ద దుంగలు వంటి కలప అయితే సుమారు రూ.30 నుంచి రూ.50వేలు పలుకుతున్నట్లు సమాచారం.
ఈ కలప వ్యాపారంలో అత్యధికంగా వేప, తుమ్మ, వంటి చెట్ల కలపను నరుకుతూ ప్రతి రోజు రాత్రి సమయంలో పదుల సంఖ్యల ట్రాక్టర్లలల్లో వ్యాపారం చేస్తుండడం గమనార్హం. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు అటువైపు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు తావిస్తోంది. ఇంకొంతమంది సామిల్ డిపోలు నిర్వహిస్తున్న వ్యాపారులు తప్పుడు బిల్లులను సృష్టించి అక్రమ వ్యాపారులతో తమ వ్యాపారాన్ని మూడు పూలు ఆరు కాయలుగా అన్న చందంగా కొనసాగిస్తున్నారు.
మండల పరిధిలో పదుల సంఖ్యలో ఉన్న ఇటుక బట్టీలకు ఈ కలప తరలడంతో బట్టి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ పొగకు లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీల వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఊరు శివారు ప్రాంతాల్లో నిర్వహించవలసిన ఇటుక బట్టీలను ఊళ్ళలోనే ఏర్పాటు చేయడంతో వాయు కాలుష్యం పెరిగి ప్రజలను రోగాల బారిన పడేందుకు బట్టి నిర్వాహకులు ప్రత్యక్ష కారకులవుతున్నారు. ఇకనైనా వాల్టా చట్టం ప్రకారం చెట్లను నరికి వ్యాపారం చేసే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ కలప రవాణా…
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

