Friday, April 3, 2026

అన్నం సేవలు అజరామరం

- Advertisment -

నేటి వారధి న్యూస్

స్థానిక ఏ ఎస్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల శాంతినగర్ ఖమ్మం నందు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ను ప్రిన్సిపాల్ ఆర్ గోవిందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సేవా బాంధవుడు , అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు గౌరవ అతిథిగా విచ్చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్ డీఐఈఓ రవిబాబు మాట్లాడుతూ మానవతా విలువలు కనుమరుగవుతున్న నేటి సమాజంలో కులమతాలకు అతీతంగా ఎందరికో అన్నం ఫౌండేషన్ తరపున సేవలు అందిస్తూ , ఎన్నో అనాధ శవాలకు తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించి అనాధాశ్రమం నిర్వహిస్తూ ముందుకు వెళుతున్న అన్నం శ్రీనివాసరావు గారి సేవలు ప్రభుత్వం గుర్తించి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పుస్తకంలో వారి గురించి ముద్రించటం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు . అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అనే దృక్పథంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా , సమాజం పట్ల అవగాహనతో మెలగాలని కోరారు . ఇదే కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితులలో అన్నం ఒక ఫ్రంట్ లైన్ వారియర్ గా నిలుచుని సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు . వారి సేవలను గుర్తించి కళాశాల తరుపున అన్నం శ్రీనివాసరావు ను ఘనంగా సన్మానించుకొనుట జరిగింది . ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా శాంతినగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణ కుమారి , ఇన్చార్జి డాన్ బోస్కో , కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు .

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -