నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
5/9/2025
ఖమ్మం: ఈ ఏడాది శ్రీ గణేశ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాన్ని కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొని, అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ ఉత్సవాల ద్వారా ఐకమత్యం పెంపొందుతుందని ప్రజలందరూ ఒకే కుటుంబం వలె ఒకచోట చేరి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషిదాయకముని వారు తెలిపారు. ఎవరి శక్తి కొలది వారు హితోదికంగా ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి నాయకులు తొగరు భాస్కర్, ఏమ్మె రామకృష్ణ, సెల్వం జ్ఞానేశ్వర్, తుల్మా శ్రీనివాస్ బొల్లక శ్రీనివాస్, భైరోజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

