Friday, April 3, 2026

అమృత వర్షిణి జయరాజుకు “భారత సాహితీ రత్న” పురస్కారం

- Advertisment -

నేటివారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు స్కూల్ అసిస్టెంట్ అమృత వర్షిణి జయరాజుకు భారత సాహితీ రత్న పురస్కారం 2024 కు లభించింది. ఆదివారం ముదిగొండ మండల కేంద్రంలో “పుడమి సాహితి వేదిక తెలంగాణ-” 6 వార్షికోత్సవం సందర్భంగా పుడమి రత్న జాతీయ విశిష్ట సేవ పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సాహితీ రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న అమృత వర్షిణి జయరాజు కు ఈ పురస్కారం లభించింది. వీరు పలు నాటికలు గేయాలు కవితా సంపుటికలు రచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భక్త రామదాసు పదో తరం వంశీయులు కంచర్ల శ్రీనివాస్ రావు. పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ చలమల హైమావతి పుడమి సాహిత్య వేదిక అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి , చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. భారత సాహితీ రత్న పురస్కారం అమృత వర్షిణి కి లభించడం పట్ల ఖమ్మం సాహితి వేత్తలు ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో అన్నం పౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు పర్యావరణ వేత్త కడవెండి వేణుగోపాల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -