Saturday, April 4, 2026

అసంఘటితరంగా కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి TUCI  జిల్లా కార్యదర్శి G. రామయ్య…

- Advertisment -

నేటి వారధి న్యూస్
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) పాలేర్ ఏరియా కమిటీ అధ్యక్షులు గోస్ పుల్లయ్య అధ్యక్షతన ఖమ్మం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పాలేరు కమిటీ సమావేశంలో పాల్గొన్న టి యు సి ఐ జిల్లా కార్యదర్శి రామయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించకుండా, ప్రభుత్వ రంగాల్లో పని చేసే కార్మికులకు కనీస వేతన అమలు చేయకుండా కార్మిక హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలమైన చట్టాలను తయారు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశంలో ఉన్న కార్మిక వర్గానికి తీవ్ర నిరాశ కల్పించింది. ఇప్పటికైనా పాలకవర్గాలు అసంఘటిత రంగమైన కార్మిక వర్గమగు హమాలీ భవనిర్మాణ కార్మికులు మోటార్ వాహన రంగ వంటి మొదలగు కార్మికులకు ప్రభుత్వ రంగాల్లో పనిచేసే మున్సిపల్, గ్రామపంచాయతీ, గవర్నమెంట్ హాస్పిటల్, అంగన్వాడీలు ఆశలు మధ్యాహ్న భోజన వర్కర్లు లకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు, ఈ సందర్భంగా కార్మిక వర్గం తమ హక్కులు సాధనకు ఐక్య ఉద్యమాలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ పాలేరియా కార్యదర్శి పగిడికత్తుల రామదాస్, ఉపాధ్యక్షులు ఎడ్లపల్లి ఉపేందర్ పెదపాకఎంకన్న సహాయ కార్యదర్శి శీలం లెనిన్ మీగడ సైదులు గుడిచు ట్టు మాధవరావు కత్తుల బిక్షం కందుల వెంకటేశ్వర్లు అక్కి నాగరాజు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -