Friday, April 3, 2026

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పెళ్లి.. అనుమానంతో గర్భిణి అయిన భార్యను హతమార్చిన భర్త

- Advertisment -

నేటి వారధి న్యూస్
ముఖంపై దిండు అదిమిపెట్టి హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ – కుషాయిగూడలోని నాగార్జున నగర్లో కాచిగూడ రాజ్మాహల్లాకు చెందిన సచిన్ సత్యనారాయణ(21)కు కాప్రాకు చెందిన ఠాకూర్ స్నేహ(21)తో 2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో 2022లో వివాహం చేసుకున్నారు.. వీరికి పుట్టిన బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కొన్ని నెలల పాటు ఇద్దరూ దూరంగా ఉన్నారు
ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసే సత్యనారాయణ నెల రోజుల క్రితం భార్యతో మళ్లీ రాజీ కుదుర్చుకుని నాగార్జుననగర్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. కొద్ది రోజుల అనంతరం భార్య ఏడు నెలల గర్భవతి అని తేలడంతో సత్యనారాయణకు ఆమెపై అనుమానం ఏర్పడింది
ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్య ఏడు నెలల గర్భిణీ ఎలా అయిందని అనుమానంతో మళ్లీ గొడవలు
మొదలయ్యాయి. ఈ నెల 16న తెల్లవారు జామున స్నేహతో గొడవపడ్డ సత్యనారాయణ ఆమె కడుపుపై కూర్చొని తలదిండుతో ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడుదీంతో కడుపులో ఉన్న ఏడునెలల పిండం కూడా బయటపడింది. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో చేసిన నేరం ఒప్పుకున్నాడు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -