Friday, April 3, 2026

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండించండి.

- Advertisment -


చమురు, డాలర్ ఆధిపత్యం కోసమే అగ్రరాజ్యాల అరాచకం ఎన్.వి. రాకేష్ మండిపాటుసిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) నిరసన

నేటి వారధి తెలుగు పత్రిక ప్రతినిధి
ఖమ్మం:​కామేపల్లి ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయిల్ దేశాలు సాగిస్తున్న అమానుష దాడులను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) కామేపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పండితాపురం గ్రామంలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ‌ నిరసన తెలిపారు.
​ఈ నిరసనను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.వి. రాకేష్ మాట్లాడుతూ.గల్ఫ్ దేశాల్లోని చమురు సంపదపై ఆధిపత్యం కోసమే అమెరికా ఈ యుద్ధోన్మాదాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే భారతదేశం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే దాడులను నిలిపివేయాలని, భారత ప్రభుత్వం కూడా ఈ నరమేధాన్ని ఖండించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ​నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు చల్ల రాజు, రాయల నాగేశ్వరరావు, బత్తుల బిక్షం, బత్తుల వెంకన్న, చల్లా చిన్నమ్మాయి, చల్ల సీతమ్మ, నాగేశ్వరరావు, నాగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -