Friday, April 3, 2026

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు అడిషనల్ డీసీపీ లా &ఆర్డర్

- Advertisment -

నేటి వారధి తెలుగు దినపత్రిక
ఖమ్మం: పోలీస్ కమిషనర్ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్.నుంచితెలంగాణకు ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం మధిర రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించిన అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ..జిల్లా సరిహద్దుల నుండి ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేయాలని అన్నారు
చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ నిర్వహణ, డయల్ 100 కాల్స్, పిటిషన్ ఎంక్వైరీలు, విలేజ్ హిస్టరీ షీట్లు, హిస్టరీ షీట్లు, ఎన్‌బిడబ్ల్యులు, సిసిటిఎన్‌ఎస్, రిసెప్షన్, యుఐ కేసులు, వివిధ కేసుల్లోని వాహనాలు, పోలీస్ స్టేషన్ పరిసరాల శుభ్రత, 5-ఎస్ అమలు, గ్రామ సందర్శన, అంతర్ రాష్ట్ర సరిహద్దు ఇసుక చెక్‌పోస్టులు, పెట్రోలింగ్ వ్యవస్థ, విజిబుల్ పోలీసింగ్‌ అమలుపై సమీక్ష జరిపారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -