నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలభారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ. పని ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, టెంట్లు మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని, మంచినీటి సదుపాయం కల్పించాలని , మజ్జిగ ప్యాకెట్లు అందించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో అనారోగ్యానికి గురైన కూలీలకు ప్రభుత్వమే వైద్య సౌకర్యం ఉచితంగా కల్పించాలని ఆయన కోరారు. పని పరికరాలైన గడ్డపారలు పారలు తట్టలు నీడకు టెంట్లు తక్షణమే ఉపాధి కూలీలకు అందజేయాలని కోరారు. కూలీలకు పేస్లిప్పులను అందజేయాలని అదేవిధంగా వారానికి ఒకసారి పేమెంటు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కూలీలకు సరిపడా వేతనం అందించేందుకు ప్రభుత్వం ,అధికారులు చర్యలు చేపట్టాలని బానోతు ధర్మ కోరారు. వేసవికాలంలో వేసవి బోనస్ కింద 50% అదనంగా కూలికి కలిపి చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు భీమా తరహలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని దానికి ప్రభుత్వమే నిధులు సమకూర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఉపాధి పథకం పనిని రెండు వందల రోజులకు పొడిగించాలని, కూలీలకు కొలతలు లేకుండా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు. పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారి వేతనాలను నెలలుగా చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఉపాధి కూలీలకు గత సంవత్సరం రావలసిన పెండింగ్ వేతనాన్ని తక్షణమే చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా నాయకులు పారుపల్లి బాబురావు రాయల సిద్దుమండల నాయకులు పైదా వెంకటేశ్వర్లు కల్తి శేఖర్ లింగాల రాములు బీ. బాబు పి కృష్ణారావు భానుతు జగదీష్ కళ్యాణ్ వి పండుఎన్ బాబు కంగాల రంజిత్ కుమార్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు రోజుకు 600 వేతనం ఇవ్వాలిజాబ్ కార్డు కలిగిన ప్రతికూలికి కూలి బీమా వర్తింప చేయాలిAIPKMSడిమాండ్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

