నేటి వారధి న్యూస్
అంబేద్కర్ గురుకులం పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 13వ తేదీతో ముగిసినట్లు ద్వారకాతిరుమల అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ బెజవాడ రాణి అన్నారు.ఈ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 6న నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఏప్రిల్ 13వ తేదీ కి వాయిదా పడిందన్నారు. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5వ తరగతి,అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు ఇంటర్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ప్రిన్సిపాల్ రాణి తెలిపారు.
ఏప్రిల్ 13 నుంచి ప్రవేశ పరీక్షలు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

