నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయం ఆయుర్వేద మూలిక వనం లో ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఔషధ మొక్కలు నాటే మహా యజ్ఞ కార్యక్రమం పిలుపు మేరకు
ఖమ్మం నాయుడుపేట డివిఎస్ స్పోర్ట్స్ ఏరిన యోగ శక్తి సెంటర్ యోగసాధకుల బృందం బుధవారం కొన్ని ఔషధ మొక్కలు స్వయంగా తీసుకు వెళ్లి ఔషధ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు,ఆదిమ కాలము నుండి ఆధునిక కాలం వరకు ప్రకృతిలో సహజ సిద్ధంగా లభిస్తున్న వనమూలికల వైద్యం ఆయుర్వేదం సకల జీవరాశి తో పాటు మానవజాతి ఆరోగ్యాన్ని కాపాడుతున్నదని, అడవులతో పాటు వనమూలికలు కూడా అంతరించిపోతున్న పరిస్థితులు దాపరిస్తున్నందున ఎక్కడి కక్కడ వనమూలికల వనాలను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని బావి తరాల ఆరోగ్యాలను కాపాడుకొనుటకు మన వంతు కర్తవ్యంగా భావించి ఔషధ వనాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా యోగ టీచర్ కె సీతారాములు తెలిపారు,
ఈ కార్యక్రమంలో యోగా శక్తి సెంటర్ యోగ సాధకులు నారాయణ భాస్కర్ పంజాల ఐలయ్య దామోదర్ తదితరులు పాల్గొన్నారు,
ఔషధ మొక్కలు నాటే మహాయజ్ఞంలో యోగ శక్తి సాధకులు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

