Friday, April 3, 2026

కన్నుల పండుగగా ముగ్గుల పోటీలు

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:దామా సేవా ఫౌండేషన్ ఫౌండర్ దామా స్వరూప కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీ కన్నుల పండుగగా నిర్వహించారు. రెండు వందల మందికి పైగా మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.పోటీలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారుమొదట ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి బహుమతులు ఇవ్వడం జరిగింది 20 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తు అవార్డు లు కూడా తీసుకోవడం జరిగింది సేవా కార్యక్రమంలో భాగంగానే ముగ్గుల పోటీ నిర్వహించారు
అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు ఇలాగే ప్రతి సంవత్సరం సహకరించాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిసిసి ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ రీజోనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీధర్ సెంచరీ విద్యాసంస్థల డైరెక్టర్ డివిఎస్ ప్రభాకర్ రావు మాధవి లత మరియు సంక్షేమ సంఘం సభ్యులు పంది మల్లయ్య ముత్తి నేని నాగేశ్వరావు పాల్వాయి వెంకటేశ్వరరావు లయన్ గ్రేట్ క్లబ్ మెంబర్స్ పెసర ప్రభాకర్ రెడ్డి నాగిరెడ్డి గోకుల్ కృష్ణ ట్రస్ట్ ఫౌండర్ కనక బండి విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు టెలికం డైరెక్టర్ ఉమ్మనేని కృష్ణ గన్నోజు గోవిందమ్మ ఝాన్సీ సమీరా , స్నేహితులు రామచంద్రయ్య శ్రీవాణి కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మ సత్యవతి అరుణాదేవి ,కాలనీ పెద్దలు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -