Friday, April 3, 2026

కర్ణాటకలో సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని ఖమ్మంకి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి, డిజిటల్ అరెస్టు చేసి సుమారు 1.12 కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో వ్యక్తిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు కర్ణాటకలోని హుబ్లీలో అరెస్టు చేసినట్లు సి.పి. సునీల్ దత్ గారు తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం అర్బన్ మండలంలోని టీచర్స్ కాలనికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అయిన నాగుల బ్రహ్మం గారికి ఫోన్ లో మనీ లాండరింగ్ పాల్పడారని, ముంబాయి పోలీసులమని, అరెస్టు చేస్తామని బెదిరించి, అక్టోబర్- 2024 లో ఫలు ధఫాలుగా సుమారు 1.12 కోట్ల రూపాయలు దోచుకున్న కేసులో రూ. 32 లక్షలు అకౌంటికి వెళ్ళిన మహ్మద్ జాఫర్ బెల్గాం, వయస్సు 40 సం॥ రాల వ్యక్తిని కర్ణాటకలోని హుబ్లీలో అరెస్టు చేసినట్లు, నిందుతున్ని సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ కి తరలించారు అని తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించి, కర్ణాటకలోని హుబ్లీలో నిందుతున్ని అరెస్టు చేసి, ఖమ్మంకి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకువచ్చిన సైబర్ క్రైమ్ డి. ఎస్పీ, CH.R.V. ఫణిందర్ గారిని, ఎస్సై రంజిత్ కుమార్ గారిని, సహకరించిన ఎస్సై విజయకుమార్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సి.పి. అభినందించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -