నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కష్టజీవుల ముద్దుబిడ్డ, పేదల పెన్నిధి, నిస్వార్థ కమ్యూనిస్టు నేత పువ్వాడ ఉదయ్ కుమార్ అని సీపీఐ పట్టణ నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు అన్నారు.స్థానిక సీపీఐ కార్యాలయంలో మా రెడ్డి శివాజీ అధ్యక్షతన పువ్వాడ ఉదయ్ కుమార్ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఏపూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కష్టజీవులకు అండగా ఉంటూ, పేదల గుడిసెల్లో ఒకటిగా మెలుగుతూ, శ్రమజీవుల తోబుట్టువుగా పువ్వాడ ఉదయ్ కుమార్ పేరు తెచ్చుకున్నారని అన్నారు.
అనుక్షణం పేదల సంక్షేమాన్ని కోరుతూ, వారి హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. ఉదయ్ భౌతికంగా లేకున్నప్పటికీ, పేదల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఓ పోరాట యోధుడిని కోల్పోవడం బాధాకరమైనప్పటికీ, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కంభం మెట్టు శ్రీనివాస్, రామరాజు, కుమారి తదితరులు పాల్గొన్నారు.
కష్టజీవుల ముద్దుబిడ్డ ఉదయ్ ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దాం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

