Saturday, April 4, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలిమిర్చి క్వింటాకు 25 వేల రూపాయల గిట్టుబాటు కల్పించాలి

- Advertisment -

నేటి వారధి న్యూస్
అఖిలభారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్ డిమాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 420 హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 20 తారీఖున హైదరాబాదులో జరుగు భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కారేపల్లి మండలం పేరుపల్లి ప్రాంతంలో ప్రచారం నిర్వహించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులోనే ప్రజలకు ఇచ్చిన అన్ని రకాల వాగ్దానాలను అమలు చేస్తానని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు కావస్తున్న ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా ఇంతవరకు అమలు చేయలేదని రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు ఎం ఎస్ పి గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని దీని మూలంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మిర్చి క్వింటాకు 25 వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పోడు భూములన్నింటికీ పట్టాలి ఇవ్వాలని సీతారామ ప్రాజెక్ట్ సాగునీళ్లను ఏజెన్సీ ప్రాంత మండలాలకు అందించాలని రైతు భరోసా రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని పోడు భూములన్నిటికీ పట్టాలి ఇవ్వాలని కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కౌలు రైతులకు రైతాంగానికి ఎకరానికి 15000 రూపా యలు అందించాలని జ్యోతి పథకం ద్వారా మహిళలకు 12 వేల రూపాయలు ఆటో కార్మికులకు నెలకు 15 వేల రూపాయలు పెంచి ఇస్తానని చెప్పిన అన్ని రకాల పెన్షన్లను హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంగం ఏఐకేఎంఎస్ మండల నాయకులు అలం చంద్రయ్య గురవయ్య లక్ష్మీనారాయణ రాంబాబు బాటయ్య చంటి రామ్మూర్తి నాగేశ్వరరావు కోటయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -