Friday, April 3, 2026

కామ్రేడ్ బొడ్డు బిక్షం ఆశయాలను కొనసాగిద్దాం. బొడ్డు బిక్షం సంతాప సభలో వక్తల పిలుపు

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రూరల్ మండలం, మంగళగూడెం గ్రామానికి చెందిన ఎర్ర జెండా ముద్దుబిడ్డ, పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు కామ్రేడ్ బొడ్డు బిక్షం మరణం మంగళ గూడెం గ్రామ ప్రజలకు కమ్యూనిస్టు విప్లవ ఉద్యమాలకు తీరని నష్టమని, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మోర రవి, సిపిఎం నాయకులు కొప్పుల రామయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పరకాల లక్ష్మక్క పిలుపునిచ్చారు. మంగళగూడెం గ్రామంలో బొడ్డు బిక్షం సంతాప సభ మోర రవి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్దివారిగూడెం, పోలిశెట్టి గూడెం, తీర్థాల, వెన్నారం, లకావత్ తండా తదితర గ్రామాలతో పాటు, మంగళగూడెం గ్రామ విప్లవోద్యమ పునాదిలో కామ్రేడ్ బిక్షమన్న ఒక పునాది రాయి లాంటివాడని, తన వ్యక్తిగత కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తూ.. పీడిత ప్రజల పక్షాన నిలబడి, అనేక కష్టాలకు, ఆర్థిక నష్టాలకు ఓర్చి ఖమ్మం డివిజన్ లో సారా (డిపోలకు) వ్యతిరేకంగా పోరాటం తో పాటు, అనేక రైతాంగ ఉద్యమాల్లోనూ, 1989లో ఉమ్మడి గ్రామపంచాయతీలో ఎంఎల్ పార్టీని గెలిపించడంలోనూ, తీర్థాల ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణానికి 70 శాతం నిధులు ఇస్తే 30% నిధులు సారాకాంట్రాక్టర్ల వద్దనుండి ఫండ్ సేకరించి బ్రిడ్జి పూర్తి చేయడం, ఇప్పుడున్న గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణం, మర్రిచెట్టువద్ద హాస్పటల్ నిర్మాణం వంటి కార్యక్రమాలలో కామ్రేడ్ గాదె మాధవరెడ్డి, కామ్రేడ్ నున్న నాగేశ్వరరావు గారలతో పాటు కామ్రేడ్ బొడ్డు బిక్షమన్న- కామ్రేడ్ యండపల్లి రామయ్య  నాయకత్వంలో తన సహచరులు కామ్రేడ్ మోర(భజన)వెంకయ్య, కామ్రేడ్ కొప్పుల రామయ్య, కామ్రేడ్ గుంటి ముత్తయ్య, కామ్రేడ్ మచ్చ గోపయ్య, కామ్రేడ్ బడేటి ఎల్లయ్య, కామ్రేడ్ బొడ్డు పుల్లయ్య, కామ్రేడ్ రాచబంటి ముత్తిలింగయ్య, కామ్రేడ్ నర్ర సీతమ్మ, కామ్రేడ్ చిలక లక్ష్మయ్య, కామ్రేడ్ నర్ర ముత్తయ్య, కామ్రేడ్ బద్దు, కామ్రేడ్ సాధిని చెంచమ్మ, కామ్రేడ్ వీరెల్లి లక్ష్మయ్య, కామ్రేడ్ నర్ర కిషన్, కామ్రేడ్ మోహిద్దీన్, తదితరులతో కలిసి కీలకంగా పనిచేశాడన్నారు.గ్రామంలోని రైతులందరినీ పిలిచి ఊరి చౌరస్తాలో ఎంఎల్ పార్టీ నాయకత్వంలో చర్చలు జరిపి, పాలేర్ల జీతాల పెంపు కోసం సమ్మె, రోజుకూలీరెట్లపెంపు, వరినాట్లు, కోతలు, కుప్పగోట్టుడు ముఠా రేట్ల పెంపుదల కోసం తన సహచరులతోపాటు కామ్రేడ్ బిక్షమన్న ముఖ్యపాత్ర పోషించాడని పేర్కొన్నారు. వెన్నారం చెరువు నీటి తీరువా ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా గెలిచి పనిచేశాడు. 1994 ప్రాంతంలో పార్టీ నిర్ణయం మేరకు ఖమ్మం రూరల్ మండల జడ్పిటీసిగా ఎంఎల్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడని తెలిపారు. గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ చిన్నా, పెద్ద అన్ని సమస్యలపై పోరాటంలోను, గ్రామంలో విప్లవోద్యమాన్ని నడిపించడంలో, నాయకత్వాన్ని కాపాడుకోవడంలో, నమ్మకాన్ని అమ్ముకోకుండా – అమ్మలా భావించి తన వంతు పాత్ర పోషించాడన్నారు.
ఈ ప్రాంత విప్లవోద్యమ చరిత్రలో బొడ్డు బిక్షం జీవిత కాలంలో ఎక్కువ బాగాన్నీ, తన యవ్వనాన్ని కరిగించి ధారబోసి భావితరాలకు ఉద్యమ వెలుగును అందించడంలో కామ్రేడ్ బిక్షమన్నలాంటి వారి కృషి అమోఘం అన్నారు.తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా తన వెంట నడిపించాడనీ, ఉద్యమ నేపథ్యంలో కలతలు, కష్టాలు వెంటాడినా, కేసులు నిర్బంధాలకు బెదరకుండా పీడిత ప్రజల తరఫున నిలబడి, రాజకీయంగా ఒకానొక సందర్భంలో తడబడినా సరిదిద్దుకొని, రివిజనిజాన్ని తిరస్కరించి, విప్లవకారుల ఐక్యతను కోరి, విప్లవోద్యమ స్రవంతిలో నిలిచి తుదిశ్వాస వరకు తపనపడ్డాడన్నారు.
బొడ్డు బిక్షమన్న సుదీర్ఘ సాహస చరిత్ర చెరిగిపోనిది, మరపురానిది, చిరస్మరణీయమైనది, ఆదర్శనీయమైనదన్నారు.
కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో రూపొందించబడిన గోదావరి లోయ ప్రతిఘటనా పోరాట పతాకను సమున్నతంగా ఎత్తిపడుతూ.. కామ్రేడ్ బొడ్డు బిక్షమన్న ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు దేవన్న, వెంకటేష్, న్యూడెమోక్రసీ నాయకులు శీలం సుదర్శన్, ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర నాయకులు నున్న కృష్ణ, రాచబంటి ముత్తిలింగయ్య, నర్ర కిషన్, నర పిచ్చమ్మ, గోకినపల్లి రాములు, బొడ్డు బిక్షం కుటుంబ సభ్యులు మంగళగూడెం గ్రామ ప్రజలు, విప్లవ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -