నేటి వారధి ప్రతినిధి
ఖమ్మం పట్టణంలో ఆదివారం నాడు మయూరి సెంటర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఖమ్మం జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , టి ఎస్ ఎస్ చైర్మన్ శ్రీమతి వెన్నెలక్క ల ఫ్లెక్సీ ఫోటోలకు పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల అధ్యక్షులు పాతకోటి నరసింహారావు మాట్లాడుతూ శనివారం రోజున జరిగిన శాసన సభ మండలలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిరుద్యోగ కళాకారుల గురించి ప్రస్తావించడం జరిగిందని . గత ప్రభుత్వం ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు . శాసన మండల లో ప్రసావిస్తూ కళాకారులందరినీ ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి చట్టసభలో విన్నవించడం జరిగిందని అందుకు గాను పాలాభిషేకం చేయడం జరిగిందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో కర్ష పుల్లయ్య , బొడ్డు నాగేశ్వర్ రావు , గుడిపల్లి పుల్లారావు , కొచ్చర్ల గురవయ్య , శ్రీకాంత్ , పొలూరి రాము , ఎస్కే ఫక్రుద్దీన్ , నరాటి చంద్రమోహన్ , గాదరి వెంకన్న , మాతంగి రాందాస్ , అద్దంకి నరసింహారావు , పేరాల నాగేశ్వరరావు , చేట్టి పొంగు నాగరాజు , దంతాల నారాయణ , పెద్దపాక విజయ్ , రాంబాబు , బుచ్చయ్య , ఇందు జైన్ , కాలంగి లలిత , కొమ్ము రమ తదితరులు పాల్గొన్నారు .

