Saturday, April 4, 2026

ఖమ్మం రూరల్ మండలం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ మండల నూతన కమిటీ అధ్యక్షుడిగా అంబాల వెంకటేశ్వర్లు (కె ఆర్ ఆర్ ఏ )  భారీ మెజార్టీతో విజయంసంబరాలు జరుపుకున్న ఏజెంట్లు

- Advertisment -

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రూరల్ మండలం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ మండల నూతన కమిటీ అధ్యక్షుడిగా అంబాల వెంకటేశ్వర్లు 15 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మండలంలో అసోసియేషన్ పరిధిలో మొత్తం 184 ఓట్లు ఉన్నాయి. శుక్రవారం ఈ కమిటీకి నూతనంగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో అంబాలతో బానోతు సత్యనారాయణ, హుస్సేన్ లు పోటీ పడ్డారు. ఎన్నికలలో 164 మంది ఏజెంట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంబాల వెంకటేశ్వర్లు సమీప అభ్యర్థి సత్యనారాయణపై 15 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల అధికారులు అంబాల వెంకటేశ్వర్లు నూతన కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. దుంపల ఉపేందర్ సెక్రెటరీగా, ఉపాధ్యక్షుడిగా ఎర్ర నాగులు సతీషు , జాయింట్ సెక్రటరీగా, పసుపులేటి వెంకట్ , ట్రెజరీగా మల్లాద్రి మల్లయ్య భారీ మెజారితో గెలుపొందారు , ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏజెంట్లు టపాసులు కాలుస్తూ అంబాలను ఊరేగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. అంబాల ఎన్నిక పట్ల పలువురు ప్రముఖులు ఏజెంట్లు రియల్ ఎస్టేట్ రంగాల యాజమాన్యాలు హర్షం ప్రకటించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -