నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం రూరల్,
గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు రూరల్ మండలం ఎంపీడీవో రవికుమార్ తెలిపారు. మండల పరిధిలోని మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఐదు కస్టర్డ్ల సీఎం కప్పు పోటీలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. కామంచికళ్ళు యంవిపాలెం చింతపల్లి తల్లంపాడు మంగళ గూడెం క్లస్టర్ల స్థాయి క్రీడాకారులు మండల స్థాయి పోటీలో పాల్గొంటారని ఆయన తెలిపారు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి పోటీల్లో పాల్గొనాలని ఆయన సూచించారు ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమానికి పాఠశాలప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా మండల విద్యాశాఖ అధికారి యం శ్రీనివాస్ సర్పంచ్ మేకల సత్యనారాయణ ఉపసర్పంచ్ అనిల్ గొల్లపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్పు పోటీలుఎంపీడీవో రవికుమార్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

