నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్
జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతిని మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి
శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళ ఉపాధ్యాయులుగా ఎదిగి సేవలు చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు మహిళల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించి వారు విద్యాభివృద్ధికి కృషిచేసిన సావిత్రిబాయి పూలే ఆదర్శనీయులని ఆయన అన్నారు అనంతరం పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు శ్రీదేవిని శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి నాగిరెడ్డి యాదగిరి పంజాల ఐలయ్య డిఎన్ రెడ్డి శ్రీనివాసరావు కుదూస్ అమృత వర్షిని జయరాజ్ కిష్టు తదితరులు పాల్గొన్నారు
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

