Friday, April 3, 2026

జన్మదిన సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు డిజిటల్ వేయింగ్ మిషన్స్ వితరణ చేసిన కార్పొరేటర్ కన్నం వైష్ణవి

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం :చిన్నారులు, బాలింతలు, గర్భిణి స్త్రీల సౌకర్యం కోసం తన డివిజన్ పరిధిలోని ఏడు అంగన్వాడీ కేంద్రాలకు కార్పొరేటర్ కన్నం వైష్ణవి తన జన్మదిన సందర్భంగా స్వంత ఖర్చులతో డిజిటల్ వేయింగ్ మిషన్స్ ని వితరణ చేశారు‌. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి దండ్రులు వారి చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపాలని అక్కడ వారికి సరైన పోషక పదార్థాలు అందిస్తారని, క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారని వారి సేవలను కొనియాడారు. వారి సూచన మేరకు చిన్నారులు, గర్భిణీల కు, బాలింతల సౌకర్యం కోసం ప్రతి కేంద్రానికి డిజిటల్ వేయింగ్ మిషన్స్ అందించామని, తద్వారా గర్భిణీ స్త్రీలకు అదే విధంగా పిల్లలు బరువు పరిశీలిస్తూ వారి ఎదుగుదలకు తగ్గట్టుగా బరువు చూసుకునేలా ఉపయోగపడుతుందని తెలిపారు. రానున్న కాలంలో భగవంతుని సహకారంతో మరింత సేవ చేస్తామని వారు తెలిపారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో CDPO వీరభద్రమ్మ, సూపర్ వైజర్ సత్యశీల, అంగన్వాడీ టీచర్లు నాగలక్ష్మి, రమాదేవి, శ్రీలత, శోభ, రేణుక, సంధ్య, నాగమణి మరియు నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, షేక్ రజ్జి, బాల్దే నాగేశ్వరరావు, ఎమ్మె రామకృష్ణ, సెల్వం జ్ఞానేశ్వర్, గర్శకోటి కిషన్, గోనెల సునీత, స్థానిక మహిళలు, తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -