Friday, April 3, 2026

జాలీ ప్రేమ కరుణకు ప్రతి రూపం జీసస్ క్రీస్తు ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలుముఖ్య అతిథిగా హాజరైన జావేద్

- Advertisment -

నేటి వారధి ప్రతినిధి

జీసస్ క్రీస్తు అంటే జాలీ ప్రేమ కరుణకు ప్రతి రూపం అని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ తెలిపారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు పేరం యశ్వంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ మాట్లాడుతూ… జీసస్ క్రీస్తు బోధనలు జాలీ దయా ప్రేమ కరుణతో కూడి ఉంటాయని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, జాలీ, దయా కరుణతో ఉంటుందని అన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి వారం బాధితుల నుండి వినతులు స్వీకరించి ముగ్గురు మత్రుల ద్వారా ఆయా శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. డివిజన్ స్థాయి అధ్యక్షులు వినతులు స్వీకరించి వాటికి తగు పరిష్కారాలు అయ్యే విధంగా కృషి చేస్తారనీ అన్నారు. ప్రజలు తప్పుడు ఆరోపణలు నమ్మొద్దని ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడమే పని గా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా ముగ్గురు మంత్రులు సారథ్యంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఏ ఒక్కరికీ కష్టం వచ్చినా నగర కాంగ్రెస్ వారికి అండగా ఉండి సమస్యను ప్రభుత్వం దృష్టికి పోయేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జీసస్ జీవితం జాలీ దయా ప్రేమ కరుణకు ప్రతికగా అని అన్నారు. ప్రతి ఒక్కరిపై జాలీ దయా ప్రేమ చూపించాలనేదే జీసస్ సిద్ధాంతం అని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సిద్ధాంతంతో ముందుకు పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్యఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, 8వ డివిజన్ కార్పొరేటర్ లాకవత్ సైదులు,49 వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకురి వెంకటేశ్వర్లు, మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ బిహెచ్ రబ్బానీ, సేవదల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ గౌస్,జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు విప్లవ్ కుమార్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉప అధ్యక్షులు కొంటేముక్కుల నాగేశ్వరరావు, నల్లమల సత్యం బాబు,బీసి సెల్ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆనందరావు, వేజెండ్ల సాయికుమార్, గజ్జి సూర్యనారాయణ, బండి మాధవరావు, ముక్రం, జాని, శ్రీశైలం, చల్ల ప్రతిభ రెడ్డి, భూక్యా సురేష్, డివిజన్ అధ్యక్షులు షేక్ వసీం, సయ్యద్ మహమూద్, సత్యాల వెంకటేశ్వర్లు, నాగటి చంద్రం, కందుల శ్రీను, కొలికపొంగు రమేష్ బండి నాగేశ్వరరావు, షేక్ రజి, బోజెడ్ల సత్యనారాయణ,ఫరీద్ ఖాద్రీ, భూక్యా రమేష్, యడవల్లి వీరయ్య, ఆర్కే కటబతిని, పర్వత శ్రీను, వేస్త చలపతి అజ్మీరా ఉపేందర్,వెంకటేశ్వర్లు, షేక్ జాహిర్, తెజవత్ సక్రు, పాషా, తది తరులు పాల్గొన్నారు……

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -