నేటి వారధి న్యూస్
ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేయాలి
కార్పొరేట్ ప్రైవేట్ హాస్పటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలి
పి వై ఎల్ పి ఓ డబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం డిఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా&వినతిపత్రం
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ పి వై ఎల్ పి ఓ డబ్ల్యు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తలపెట్టింది. అందులో భాగంగా శుక్రవారం పి ఓ డబ్ల్యు-పి వై ఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వందలాది మందితో ఖమ్మం డిఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం డిఎంహెచ్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పి ఓ డబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ శిరోమణి, పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ లు మాట్లాడుతూ.
ప్రభుత్వ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం అందక పోవడంతో ప్రజలు తప్పని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారని వారు అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. టెస్టుల పేరుతో, మందుల పేరుతో ఆపరేషన్ల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేస్తున్నారని వారు మండిపడ్డారు,డయాగ్నొస్టిక్ సెంటర్లపై మెడికల్ మాఫియా పై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ,ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు
అలానే ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేసి ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న డాక్టర్స్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని అన్ని రకాల మందులు సదుపాయం అన్ని రకాల టెస్టులు స్కానింగ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సౌకర్యం కల్పించాలని. ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేసి జిల్లా ప్రధాన ప్రభుత్వ హాస్పిటల్లన్నీ ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీలతో వైద్య సేవలందించాలి. వారు డిమాండ్ చేశారు లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోకినపల్లి లలిత ఆవుల మంగతాయి పి వై ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి భరత్ పి ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు టీ ఝాన్సీ జిల్లా సహాయ కార్యదర్శి శోభ పి వై ఎల్ పి ఓ డబ్ల్యు జిల్లా నాయకులు లక్ష్మణ్ అరుణ్ సరోజిని నరసమ్మ ప్రమీల చైతన్య స్వాతి అనిత అలివేలు రమేష్ వెంకటేష్ రామారావు కనకరాజు ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లన్నీ ఆధునిక వైద్య పరికరాలతో సూపర్ స్పెషాలిటీలతో వైద్య సేవలందించాలి.
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

