Friday, April 3, 2026

జీళ్ళచెరువులో ఘనంగా మహాత్మాగాంధీ వర్థంతి వేడుకలు..

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత జాతీపిత మహాత్మా గాంధీ వర్థంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన పోరాటం మరువలేనిదని, మనిషి తలుసుకుంటే చేయలేనిదంటూ ఏది లేదని, మహాత్ముడు అదే చేసి చూపించారని కొనియాడారు. ఆయన బాటలో పయనిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొండా శ్రీనివాస్ రావు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొక్క ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య, ఇంటూరి పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ కాసాని వెంకన్న, సోషల్ మీడియా అధ్యక్షుడు బెజవాడ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపగాని వీరబాబు, ఐతగాని వెంకన్న, ఐతగాని సత్యనారాయణ, అంబాల రామనాధం, అంబాల నాగేశ్వరరావు, జి. నాగేశ్వరరావు, మండవ ఉపేందర్, గ్రామస్థులు అంబాల సత్యనారాయణ, గోపి నాగేశ్వరరావు, గోపి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -