Saturday, April 4, 2026

జూన్ 28న ఖమ్మంలో జరుగు పి వై ఎల్ ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి పి వై ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ ప్రేమ్ సింగ్,ఎన్ వి రాకేష్..

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఖమ్మం.యువత.ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ గంజాయి బెట్టింగ్ వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నది ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ అని, తన జిల్లా స్థాయి జనరల్ కౌన్సిల్ లను జూన్ 28న ఖమ్మం నగరంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయని ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ ప్రేమ్ సింగ్ ఎన్ వి రాకేష్ లు తెలిపారు.
ఆదివారం స్థానిక రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని ప్రసంగిస్తూ పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ తెలంగాణ ప్రజలకు యువకులకు విద్యార్థులకు మౌలిక సమస్యలు పరిష్కారం చూపడంలో విఫలం చెందిందని అందువలనే గడిచిన ఎన్నికలలో కెసిఆర్ కు తెలంగాణ ప్రజల యువకులు బుద్ధి చెప్పారని వారు అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతో కాలం గడపకుండా ఇచ్చిన హామీలను అమలకు పూనుకోవాలని అన్నారు గత పది సంవత్సరాల నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు రాక నిరుద్యోగ భృతి లేక దిక్కుతోచని పరిస్థితిలలో కాయ కష్టం చేస్తూ జీవిస్తున్నారని,పని చేద్దామన్న పని దొరకక నానా అవస్థలు పడుతున్నారని, ఎంతోమంది యువతి యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయి యువత బతకలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు యువత ఉద్యోగ ఉపాధి లేక ఈజీ మనీకీ అలవాటు పడి బెట్టింగ్ యాప్స్ కు బానిసవుతున్నారని బెట్టింగ్ల డ్రగ్స్ గంజాయి వల్ల యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ భృతి 6000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో యువకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైనా నిరుద్యోగం మరియు యువతను పక్కదారు పట్టిస్తున్న బెట్టింగ్ డ్రగ్స్ గంజాయి సమస్యపై పోరాడుతున్న ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ ను జూన్ 28న రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రం ఖమ్మంలో జరుగుతున్నాయని ఈ జనరల్ కౌన్సిలర్ కు యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి వై ఎల్ రాష్ట్ర నాయకులు జె.భరత్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఇస్లావత్ రమేష్ సిహెచ్ ధరణి నగర అధ్యక్ష కార్యదర్శులు అశోక్ మక్కా రవీందర్ నాయకులు డి చందు శివలాల్ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -