Saturday, April 4, 2026

జూలై 27న హైదరాబాదులో జరిగే పి.వై.ఎల్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి

- Advertisment -


పి వై ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ ప్రేమ్ సింగ్ ఎన్ వి రాకేష్

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
జూలై 27 న హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్ లో జరిగే ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని యువతకు పి.వై.ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ ప్రేమ్ సింగ్, ఎన్ వి రాకేష్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఖమ్మం సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ కి ప్రధాన వక్తగా కేంద్ర సమాచార మాజీ కమీషనర్ మాడభూషి శ్రీధర్ మరియు పి వై ఎల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎం హన్వేష్ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కెఎస్ ప్రదీప్ వి అజయ్ హాజరవుతారని తెలిపారు.యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో డ్రగ్స్, గంజాయి సేవిస్తూ తమ జీవితాలను కోల్పోతున్నారని, ప్రభుత్వం పట్టీ పట్టనట్లు ఉందని అన్నారు. కల్తీ కల్లు యదేచ్ఛగా అమ్ముతున్నా, ప్రభుత్వం అబ్కారీ అధికార యంత్రాంగం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు, కల్తీ కల్లు దుకాణాలు మూసివేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని యువత సమస్యపై బలమైన ఉద్యమాలు చేపట్టేందుకు ఈనెల 27న హైదరాబాదులో జరిగే పి వై ఎల్ రాష్ట్ర జనరల్ కేన్సిల్ జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల భరత్, ఉపాధ్యక్షుడు సిహెచ్ ధరణ్ కృష్ణ, కోశాధికారి తోట రమేష్ నాయకులు ఇస్లావత్ రమేష్,గోడ్డెటి అశోక్ పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -