Friday, April 3, 2026

టీటీడీకి భారీ విరాళం రూ.2.45 కోట్లు

- Advertisment -

నేటి వారధి న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న వివిధ ధార్మిక పథకాల కోసం గురువారం భారీ విరాళాలు అందాయి.చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ ఫ్రా వెంచర్స్ సంస్థ ఎస్‌.వి. అన్నప్రసాదం ట్రస్టుకు ₹1 కోటి విరాళంగా అందించింది. శ్రీలంకకు చెందిన ఓ దాత కూడా అన్నప్రసాదం ట్రస్టుకు ₹1 కోటి విరాళంగా ఇచ్చారు.
అంతేగాక, నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ₹45 లక్షలు విరాళంగా అందించింది.
ఈ సందర్భంగా దాతలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరిలకు విరాళాల చెక్కులను అందజేశారు.
టీటీడీ ప్రతినిధులు ఈ సందర్భంగా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సతత సహకారంతో అన్నప్రసాదం, ప్రాణదాన సేవలు మరింత విస్తృతంగా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -