నేటి వారధి న్యూస్
ఖమ్మం జిల్లా బోనకల్లు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందారు మరో 20 మందికి గాయాల య్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు సమీపంలో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది, స్థానికుల వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా బోనకల్ నుంచి ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి గ్రామానికి మిర్చి కోసేందుకు కూలీలు ట్రాక్టర్లో వెళ్తున్నారు. ఒక్కసారిగా అదుపుతప్పి గోవిలో పడి పోయింది,ఈ ప్రమాదంలో యార్లగడ్డ వరమ్మ (60) అనే మహిళ మృతి చెందింది.
మరో 20 మందికి గాయాలయ్యాయి అందులో ఇద్దరి పరిస్థితిఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది, క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

