నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఇల్లందు డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించినారు.సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,ఇల్లందు సీఐ సురేష్,టేకులపల్లి సీఐ సత్యనారాయణ మరియు సబ్ డివిజన్లోని ఇతర పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని.సూచించారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అవగాహన కల్పించాలని తెలిపారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.భాధితులకు అండగా ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.అనంతరం డిఎస్పి కార్యాలయ పరిసరాలను పరిశీలించి,కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు.
డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

