నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగులగూడెం గ్రామంలో, అంగన్వాడి సెంటర్ 123 లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా కురవి సర్కిల్ సూపర్వైజర్ రమా మాట్లాడుతూ..సంపూర్ణ మానసిక వికాసానికి గాను రెండేళ్ల వయసు వచ్చే వరకుపిల్లలకు తల్లిపాలు తాగించాలి, బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు ఇవ్వాలి, మురుపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, తల్లిపాలు శిశుకు ప్రకృతి సహజ సిద్ధమైనవి సురక్షితమైనవి పూష్టికరమైనవే కాక సంపూర్ణ ఆహారం అమృత తుల్యమైన ఆంటీ బాడీస్ భలే పనిచేసే శిశువుకు రోగాలతో పోరాడే శక్తిని ఇస్తుందన్నారు ,తల్లిపాల సులభంగా జీర్ణమై బిడ్డకు చక్కటి శారీరక మానసిక సాంఘిక ఆరోగ్య అభివృద్ధి తల్లి పాలు గట్టి పునాదులు అన్నారు తల్లి శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోకి చేరిన కీడు చేయకుండా తల్లిపాలు నిరోధిస్తాయని తెలిపారు.. తల్లిపాలలో ఉన్న ప్రోటీన్స్ ఫ్యాట్ కాలుష్యం తొందరగా గ్రహించబడి శిష్యులను విరోచనాలు నిమోనియా నుండి రక్షిస్తాయని వివరించారు చిన్నారుల తల్లిదండ్రులు క్రమంగా తప్పకుండా పాలు పట్టించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో 123 సెంటర్ సి హెచ్.శైలజ,ఆర్, రజిత,జుజ్జూర్ తండ కె. అరుణ,భెగవత్ తండా కే.కళమ్మ,అసాలితండ సరిత,పిల్లలతల్లిదండ్రులు ,అంగన్వాడి ఆయాలు పాల్గొన్నారు.
తల్లిపాలు అమృతం.కురవి సర్కిల్ సూపర్వైజర్ రమా. మోదుగులగూడెం అంగన్వాడీ లో తల్లిపాల వారోత్సవాలు….
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

