Friday, April 3, 2026

తిరుపతి స్పోర్ట్స్ బైక్‌లతో రేసులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు.

- Advertisment -

నేటివారధి ప్రతినిధి
7 స్పోర్ట్స్ బైక్‌ లను స్వాధీనం.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ యల్. సుబ్బరాయుడు, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు, తిరుపతి టౌన్ డి.యస్.పి జే.వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో యస్.వి.యు పి.యస్ సి.ఐ యం. రామయ్య మరియు సిబ్బందితో కలిసి తిరుపతి టౌన్ పరిధిలోని యస్.వి.యు పి.యస్, అలిపిరి పి.యస్ పరిధి ప్రాంతాల్లో, ఫ్లై ఓవర్ రోడ్లు, జూపార్క్ రోడ్డుల్లో స్పోర్ట్స్ బైక్‌లతో రేసులు నిర్వహించేవారిపై, ప్రమాదకర విన్యాసాలు చేస్తూ వీడియోలు Instagram, WhatsApp లలో పోస్టు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా 7 బైక్‌ లను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, కేసులు నమోదు చేసి RTO కు నివేదించారు.
కావున తిరుపతి పట్టణంలోని రహదారులు, ఫ్లై ఓవర్లు, జూపార్క్ రోడ్డులు మరియు ఇతర ప్రాంతాల్లో స్పోర్ట్స్/రేస్ బైక్‌లతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ, అతివేగంతో నడుపుతూ శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై మరియు నంబర్ ప్లేటు లేని బైక్‌ లతో నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచబడుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై BNS చట్టం మరియు మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి, వారి వాహనాలు స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
పోలీసుల హెచ్చరిక:
భద్రతా నిబంధనలు మరియు రహదారి రూల్స్ ఉల్లంఘనకు భారత న్యాయ సంహిత మరియు మోటారు వాహనాల చట్టం (MV Act) ప్రకారం కఠిన శిక్షలు విధించబడతాయి.ఈ రకమైన స్టంట్స్ మరియు రేసులు ప్రాణాలను ప్రమాదంలో పడేయటమే కాకుండా యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉంది.రహదారిపై అల్లర్లు, ప్రమాదకర డ్రైవింగ్‌ చేసిన వారిపై జీవితాంతం డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, భారీ జరిమానాలు వంటి శిక్షలు అమలు అవుతాయి.
విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు విజ్ఞప్తి:
విద్యార్థులు తమ భవిష్యత్తును రక్షించుకోవడానికి రహదారి నిబంధనలను కచ్చితంగా పాటించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల బైక్ వినియోగంపై కఠినంగా పర్యవేక్షణ చేయాలి.
ప్రజలందరూ రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని పోలీసులు కోరారు.
స్వాధీనం చేసుకున్న బైక్‌ల వివరాలు:

  1. KTM Bike No. AP39RG8009
  2. KTM Bike No. AP39BT0200
  3. KTM Bike No. AP39AT7473
  4. Yamaha R15 No. AP40AZ1779
  5. Kawasaki No. AP39LY0324
  6. Triumph No. AP40AZ0765
  7. Continental GT No. AP40F1288
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -