నేటి వారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం సాదిని వీరబాబు ఆనంద్ పాల్ ఆధ్వర్యంలో ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది. చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు, రోగులకు ఉచిత పండ్లపంపిణీ,నిరుపేదలైనటువంటి ఖమ్మం పట్టణంలో యాచకులకు పులిహార ఆహార పొట్లాల పంపిణీ, తదితర ఎన్నో కార్యక్రమాలు కుల మత భేదాలు.లేకుండా.జరిగిస్తున్నారు ఖమ్మం పట్టణంలో ఎల్ల బోయిన నవీన్ అనె వ్యక్తికి కాలుకు సెప్టిక్ కావడం వల్ల తన కాలును పూర్తిగా తొలగించారు. ఒంటి కాలుతో కుటుంబ పోషణ కొరకు ఆటో నడుపుతుండగా బ్యాటరీ ప్రాబ్లం వల్ల సెల్ఫ్ కాక ఏందో ఇబ్బందులు పడుతుండగా ఈ విషయాన్ని వారు ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్టు దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే స్పందించిన ట్రస్ట్ యాజమాన్యం ఎల్లబోయిన నవీన్ కుటుంబమునకు ఎక్సైడ్ బ్యాటరీని అందించి వారి ప్రేమను వ్యక్తపరిచారు . ఈ కార్యక్రమంలో ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బ్రదర్ వీరబాబు ఆనంద్ పాల్, ట్రస్ట్ ట్రెజరర్ మాధవి బోనకల్ సి. బి. టి. ప్రిన్సిపల్ మహేష్, ఖమ్మం ఎలక్ట్రిషన్ శ్రీను, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ద పీపుల్స్ ఆఫ్ గాడ్ చారిటబుల్ ట్రస్ట్ మంగళ గూడెం వారి ఆధ్వర్యంలోబ్యాటరీ పంపిణీ
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

