నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మహబూబాబా జిల్లా: డోర్నకల్ ఏడాది కాలంలో ఇద్దరు సీఐ లను ట్రాప్ చేసిన ఏసీబీ.పోలీస్ శాఖ కు మచ్చ తెచ్చేలా కొందరు పోలీస్ అధికారుల తీరు.మరింత వ్యవహారం చేజారి పోకుండా అవినీతి మరకలున్న అధికారుల తీరుపై జిల్లా ఎస్పీ దృష్టి సారిస్తే ప్రజలకు శాఖ పై గౌరవం పెరిగే అవకాశం ఉంది.కంచె చేను మేసే చందంగా తయారయ్యింది జిల్లా పోలీస్ శాఖ లోనీ కొందరి అధికారుల తీరు.ప్రజలకు సత్వర రక్షణ సేవలు అందించి అండగా ఉండే పోలీస్ శాఖ లో కొందరి అవినీతి బుద్ధి అధికారుల తీరు జిల్లా పోలీస్ శాఖ కు మాయని మచ్చని తెచ్చి పెడుతుంది.జిల్లాలో బెల్లం, గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపాలనే ఎస్పీ సంకల్పాన్ని కొందరు అవినీతి అధికారులు నీరు కార్చే విధంగా వ్యవహరిస్తున్నారు.ఫలితంగా ఏడాది కాలంగా జిల్లాలోని ఇద్దరు సీఐ లు ఎసిబి వలకు చిక్కారు..మొన్నటికి మొన్న తొర్రూరు సర్కిల్ పరిధిలో ఓ బెల్లం వ్యాపారిని లంచం డిమాండ్ చేయడం తో సదరు వ్యాపారి ఏసీబీ అధికారులను సంప్రదించి జగదీశ్ అనే సీఐ నీ ఎసిబి కి పట్టించాడు.అది మరవక ముందే డోర్నకల్ సీఐ రాజేష్ బెల్లం వ్యాపారిని 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా నేడు ఏసీబీ ట్రాప్ చేసింది.ప్రభుత్వ ఉద్యోగం గగనమైన ప్రస్తుత రోజుల్లో కస్టపడి చదివి ఉద్యోగం సాధించి చిన్న విషయాలపై దృష్టి సారించి బంగారు భవిష్యత్తు ను ఆఫీసర్ లు ఆగం చేసుకుంటున్న తీరుపై జిల్లా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జిల్లా అధికారులు ఇలాంటి అధికారులపై దృష్టి సారించి మరో ఘటన జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
నాడు జగదీష్..నేడు రాజేష్.వరుస ట్రాప్ లతో జిల్లా పోలీస్ శాఖ లో ఏసీబీ కలవరం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

