Friday, April 3, 2026

నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలకు అంతరాయం  ప్రజలు అప్రమత్తంగా ఉండండి

- Advertisment -

నేటి వారధి న్యూస్
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు ఈ నెల 22 నుంచి 25 వరకు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.
ఏపి & తెలంగాణలో ప్రభావం
ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొననున్నారు. బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితమవుతాయి. ప్రజలు ముందుగానే తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ లావాదేవీలు పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బ్యాంకుల సెలవులు – సమ్మె తేదీలు
మార్చి 22 – నాల్గవ శనివారం (బ్యాంక్ సెలవు)
మార్చి 23 – ఆదివారం (బ్యాంక్ సెలవు)
మార్చి 24 – బ్యాంకు సమ్మె
మార్చి 25 – బ్యాంకు సమ్మె
ఇవే కాకుండా, మార్చి 29 (గుడ్ ఫ్రైడే)న కూడా బ్యాంకులకు సెలవు కావడంతో, ప్రజలు తమ బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే తీర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
కస్టమర్లకు సూచనలు:
ఎటిఎం నుంచి నగదు డ్రాయల్ ముందుగానే చేసుకోవాలి.
డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవాలి.
చెక్కుల క్లియరెన్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఈ సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు పెద్దగా ఆటంకం కలగకుండా ప్రజలు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని బ్యాంకింగ్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -