నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:తెలుగు సాహిత్యంలో నిత్య స్మరణీయుడు మహాకవి గుర్రం జాషువానిలుస్తాడని ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజా మనోహరరాజు అన్నారు ఆదివారం రాత్రి మహాకవి గుర్రం జాషువా 130 లో జయంతి సందర్భంగా , జాషువా సాహిత్య వేదిక ఖమ్మం అధ్యక్షులు ప్రముఖ కవి విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రముఖ కవి విమర్శకులు పరిశోధకులు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య కు మన కాలపు జాషువా అవార్డు ను అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాషువా జీవితానికి అయిలయ్య జీవితానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో నలభై ఏళ్లుగా కవిగా పరిశోధకుడిగా,పరిశోధనా మార్గదర్శిగా అనేక లోతైన పరిశోధనలు చేయించారని తెలిపారు.అనంతరంఅవార్డుని అందజేశారు ఈసందర్భంగా అయిలయ్య ప్రతిస్పందన గా మాట్లాడుతూ ఖమ్మం లొ జాషువా అవార్డు తీసుకోవడం గర్వకారణంగా ఉందన్నారు.సాహిత్యానికి నిత్య కేంద్రంగా ఉంటూ రెండు రాష్ట్రాల్లో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు.కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఇల్లందు, తొర్రూరు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.వై.చిన అప్పయ్య,డా.బి.రాములు, గౌరవ అతిథులుగా కొత్తపల్లి గురుప్రసాద్,పంజాల అయిలయ్య, కిన్నెర వెంకటేశ్వర్లు,వురిమళ్ల సునంద డా.బాలునిర్మల, జాషువా సాహిత్య వేదిక కార్యదర్శిపగిడిపల్లి వెంకటేశ్వర్లు , ఖమ్మం కవులు కళాకారులు సాహిత్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు
నిత్య స్మరణీయుడు జాషువా
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

