Friday, April 3, 2026

నీలి కన్నుల సుందరి మోనాలిసా..!

- Advertisment -

నేటి వారధి న్యూస్
సబ్బు కలం
ముఖంలో నవ్వులు
నీలి కన్నుల పువ్వులు
సింగారపు పూసలతో
వయ్యారపు నడకలు…
అందానికే ఈర్ష్య పుట్టేలా
పున్నమి చంద్రుడే నేలకు దిగేనా
మాటల్లో తేనెలొలుకు తూ
కుంభమేళా లో మధుర కుండ..
దిగివచ్చిన గంధర్వమా
ఆకర్షించే మంత్రమా
నేలపై పాలవెల్లువలా
పరవశించిన నీలి మేఘమా..
చూపు తిప్పని సౌందర్యం
సుతిమెత్తని లావణ్యం
అమాయకపు లాస్యం
కనులలో కాంతి విరబూసే..
నడయాడే నదిలా
ప్రవహించెను జన సందోహంలో
వడి వడి అడుగులతో
ఏకము చేసి ముఖారవిందం..
చీకట్లో మెరిసిన రత్నం లా
ముత్యపు సరుల సోయగం
మతులెన్నో చెలించే
వెన్నెల కాంతులు విరజిల్లే..
త్రివేణి సంగమంలో
పవిత్ర స్థలములో
అక్షర కావ్యంలా నిలిచే
జన సంద్రానికి చేరువై ప్రవహించే..
నీలి కన్నుల సుందరి మోనాలిసా రచన:-సబ్బు నాగ సునిత ప్రజా కవి

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -