నేటి వారిధి న్యూస్
ఖమ్మం నగరం లోని 46 వ డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర కాలమానిని గౌరవ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు.ఆవిష్కరించారు వారి తో పాటు నగర మేయర్ పునకొల్లు నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ముఖచిత్రాలతో క్యాలెండర్ ని తయారు చేయడం అభినందనీయమన్నారు. కార్పోరేటర్ గా రానున్న కాలంలో ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవను అందించాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా కార్పొరేటర్ గారి వినతి మేరకు డివిజన్ కి నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ డివిజన్
అధ్యక్షుడు షేక్ రజ్జి
నాయకులు బాల్దె నాగేశ్వరరావు, దాచేపల్లి మల్లయ్య, ఘర్ష కోటి నారాయణ, వెలిశాల వెంకటేశ్వర్లు, గోనెల రవిశంకర్, మీర్జా అజీజుల్లా బేగ్, నజీర్, చంద్రమ్మ, తుల్మా శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

