నేటివారధి న్యూస్
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పంజాల ఐలయ్యకు పుడమి రత్న పురస్కారం 2024 కు లభించింది. ఆదివారం ముదిగొండ మండల కేంద్రంలో “పుడమి సాహితి వేదిక తెలంగాణ-” 6 వార్షికోత్సవం సందర్భంగా పుడమి రత్న జాతీయ విశిష్ట సేవ పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యారంగంలో పలు సేవలు అందిస్తున్న పంజాల ఐలయ్యకు ఈ పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భక్త రామదాసు పదో తరం వంశీయులు కంచర్ల శ్రీనివాస్ రావు. పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు, మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ చలమల హైమావతి పుడమి సాహిత్య వేదిక అధ్యక్షులు చిలుముల బాల్ రెడ్డి , చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పలు సేవలందిస్తున్న ఐలయ్యకు పుడమి రత్న పురస్కారం లభించడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్ పలువురు ఉపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో అన్నం పౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు పర్యావరణ వేత్త కడవెండి వేణుగోపాల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
పంజాల ఐలయ్యకు ” పుడమిరత్న” పురస్కారం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

