Friday, April 3, 2026

పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisment -

తెలంగాణ పెన్షనర్ల పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం అధ్యక్షుడు సీతారాములు డిమాండ్ చేశారు

నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం:తెలంగాణ సంక్షేమ శాఖల విశ్రాంతి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు ఆఫీసర్ల అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం ఏ దులాపురం పరిధిలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు . ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆయన అన్నారు, పిఆర్సి, డి ఏ లు, మంజూరు చేయడంలో జాప్యం చేస్తుందన్నారు అలాగే హెల్త్ స్కీమ్ ను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఈనెల ఏడో తారీఖున హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పెన్షనర్ల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆత్మీయ సమ్మేళనంలో సీనియర్ సిటిజనులకు, ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగు లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిచ్చిరెడ్డి గంగయ్య పి సుదర్శన్ వెంకట నరసమ్మ యాస వెంకటేశ్వరావు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -