నేటి వారధి తెలుగు దినపత్రిక ప్రతినిధి
ఢిల్లీ :వాహనదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్ పై రూ.13 ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.3కు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అలాగే డీజిల్ పై ఉన్న రూ.10 ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది, యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) దిగ్బంధానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం గుండానే సాగుతుంది. భారత్ తన చమురు దిగుమతుల్లో సుమారు 40 నుంచి 50 శాతం ఈ మార్గం నుండే పొందుతోంది. దీనివల్ల దేశంలో పెట్రో ధరలు ఆకాశాన్నంటకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యుద్ధం కారణంగా గ్యాస్ మరియు చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని మరోమారు తెలిపింది. 30 రోజులకు సరిపడా ఎల్పీజీ (LPG) సిలిండర్ల సరఫరా అందుబాటులో ఉందని చెప్పింది. కొరత ఏర్పడుతుందనే ప్రచారాన్ని నమ్మి భయంతో అనవసరంగా స్టాక్ చేసుకోవద్దని, అటువంటి వార్తలు కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

