నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
కురవి : అధికార పార్టీని అడ్డం పెట్టుకొని పేదోడి ఇంటిపై దౌర్జన్యం చేస్తూ.., జెసిబి యంత్రం సహాయంతో అర్ధరాత్రి ఇంటి గోడలు కూల్చి ఇంటి స్థలం ఇవ్వకుంటే చంపుతానని భయభ్రాంతులకు గురి చేస్తున్న మాలోత్ నెహ్రునాయక్ వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలని భూక్య మంగీలాల్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని (బలుపాల) లింగ్యాతండా(బి) గ్రామానికి చెందిన బాధితులు భూక్యా మంగీలాల్ కుటుంబ సభ్యులు సోమవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం పూర్వకాలం నుండి వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలములో ఉన్న పాత ఇల్లు శిధిలావస్తకు వచ్చి కూలి కూలిపోయే దశలో ఉన్నదని, గత ఆరు నెలల క్రితం పాత ఇంటిని కూల్చి నూతనంగా భవనం నిర్మిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ వారి ఇంటి వాస్తు కోసం ఇంటి స్థలం ఇవ్వాలని, లేదంటే ఇంటి నిర్మాణం చేసుకోనివ్వనని బెదిరిస్తున్నాడు. ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీలో నమోదయి ఉన్న పాత ఇంటి నెంబర్ స్థలములో నూతన భవనం నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే మాలోత్ నెహ్రు నాయక్ తన అధికార పలుకుబడితో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని జిల్లా కలెక్టర్, స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేసి ఇల్లు నిర్మించుకోండి. ఇల్లు నిర్మాణానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. దీంతో ఆదివారం ఇంటి నిర్మాణానికి పిల్లర్లు వేసి గోడలు నిర్మించుకుంటే.., నెహ్రు నాయక్ తన అనుచరులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు టిజి 07ఎ 2947 జెసిబి నెంబర్ యంత్రంతో అక్రమంగా ఇంటి స్థలంలోకి ప్రవేశించి ఇంటి నిర్మాణ గోడలు ధ్వంసం చేసి కూల్చారని ఆరోపించారు. సోమవారం ఇదేమిటని నిలదీస్తే ఇంటి స్థలం అమ్మాలని బలవంతం చేస్తూ మీరు ఇల్లు నిర్మాణం చేపడుతుంటే నేను కూల్చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కురవి పోలీస్ స్టేషన్లో నెహ్రూ నాయక్ వారి అనుచరులపై ఫిర్యాదు చేశామని, అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు భూక్య మంగీలాల్ కుటుంబ సభ్యులు కోరారు.
పేదోడి ఇంటి పై నెహ్రూ నాయక్ దౌర్జన్యం అర్థరాత్రి జెసిబి సహాయంతో ఇంటి గోడలు కూల్చివేత ఇంటి స్థలం ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరింపులు మాలోత్ నెహ్రు నాయక్ .పైచర్యలుతీసుకోవాలి బాధితులు భూక్య మంగీలాల్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

