Friday, April 3, 2026

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisment -

నేటి వారధి న్యూస్
సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుండి ఖమ్మం వైపునకు వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలాయి. దీంతో కారు కంట్రోల్ తప్పింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచఖ్యంతో వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటికి ఏం జరుగకపోవడంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయనతో కారులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -