వలస సుభాష్ చంద్రబోస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ
నేటి వారధి న్యూస్( ప్రతినిధి)
కరీంనగర్ జిల్లా కేంద్రంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ విలేకరులకు ప్రకటన విడుదల చేసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ప్రజాస్వామ్యానికి ఓటే పునాదని ఆయన అన్నారు ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు శత శాతం ఓటింగ్ కోసం అందరూ ఓటు హక్కునువినియోగించుకోవాలని ఆయన కోరారు ఓటు వజ్రాయుధం లాంటిదని అన్నారు ఇలాంటి ప్రలోభాలకు లోను కావద్దని పౌరులకు పిలుపునిచ్చారు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలోజరుపుకోవాలని ఆయన కోరారు మా సంకల్ప సంస్థ ద్వారా లోకసభ శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో యువతకు ప్రజలకు మహిళా సంఘాలకు ఓటర్ చైతన్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన గుర్తు చేశారు

