నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
నేడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంతిరుమలగిరిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజా ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుంది. తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి తో కలిసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

