నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
తెలంగాణ: బలవంతంగా డబ్బులు వసూలు చేసే చర్యలపై ఇకపై ఎలాంటి సహనం ఉండబోదని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠినంగా హెచ్చరించారు. ట్రాన్స్‌జెండర్ అనే పేరుతో ప్రజలను బెదిరించడం, ఇబ్బందులకు గురిచేయడం, బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఇతరులను భయపెట్టి డబ్బులు లాగేందుకు ప్రయత్నించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని సీపీ వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, నిబంధనలను అతిక్రమించిన ఎవరైనా సరే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.అయితే, చట్టబద్ధంగా జీవనం సాగిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్న ట్రాన్స్‌జెండర్‌ల హక్కులను పోలీసు శాఖ పూర్తిగా కాపాడుతుందని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే కొందరి కారణంగా మొత్తం సమాజంపై ముద్ర పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రజలు బలవంతపు వసూళ్లు, బెదిరింపులు వంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రజల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకూ అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
బలవంతపు వసూళ్లకు చెక్: ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్ ఖచ్చిత హెచ్చరిక
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

