తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
బాలిక అన్నను అరెస్ట్ చేసిన పోలీసులు
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
2/9/2025
తొమ్మిదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక శిశువుకు జన్మనిచ్చిందిఇంట్లోని బాత్ రూమ్ లో మగబిడ్డకు జన్మనిచ్చిందిఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆదివారం జరిగిందిబాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అనంతరం బాలిక సోదరుడిని అరెస్ట్ చేశారు.తల్లిదండ్రుల ఫిర్యాదు ప్రకారం.
శివమొగ్గ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుందిఅయితే, కొన్ని నెలల క్రితం తల్లిదండ్రులు పనికి వెళ్లగా, బాలిక స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది.ఈ సమయంలో 16 ఏళ్ల వయసున్న సోదరుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడుఈ విషయం ఎవరికీ చెప్పకూడదంటూ బెదిరించడంతో బాలిక భయపడి చెప్పలేదు.గర్భం దాల్చిన బాలిక తాజాగా ఇంట్లోని బాత్ రూమ్ లోనే ప్రసవం కాగా ఏడు నెలల శిశువుకు జన్మనిచ్చిందికాగా, ప్రస్తుతం శిశువు శివమొగ్గలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుందితల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోదరుడిని అరెస్ట్ చేశారుఅనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి జిల్లా బాలుర సంరక్షణ అధికారికి సమాచారం అందించారు

