వలస సుభాష్ చంద్ర బోస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలల హక్కుల ప్రజా వేదిక
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో బాలల హక్కుల ప్రజా వేదిక బాల కార్మికుల నిర్మూలన కోసం బాల్యవివాల నిర్మూలన కోసం నిరంతరంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు బాల్య వివాహాలు నిర్మలుద్దాం భవిష్యత్తుకు పునాదిద్దాం విద్య ద్వారానే సమాజంలో చిన్నారి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆయన పేర్కొన్నారు రేపు హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న సంఘాలు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు చిన్నారి పిల్లలచే ప్రచారం చేపియ్య వద్దని ఆయన కోరారు చిన్నారి విద్యార్థి చే ఎవరైనా ప్రచారం చేస్తే పూర్తి సమాచారంతో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోతామని ఆయన తెలిపారు విద్యార్థులు రానున్న రోజుల్లో తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు బాల కార్మికుల నిర్మూలన కోసం రాష్ట్రవ్యాప్తంగా బాలల హక్కుల ప్రజా వేదిక కృషి చేస్తున్నట్టు ఆయన అన్నారు చిన్నారి బాలలు వారిలో ఉన్న సృజనాత్మ శక్తి వెలికి తీసేందుకు వారిని ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులకు కృషి చేయాలని ఆయన వేడుకున్నారు చిన్నారి బాలలు సెల్ ఫోన్లకు అలవాటు పడవద్దని పేర్కొన్నారు చిన్నప్పటినుండే చిన్నారులు పట్టదలతో చదవాలని అన్నారు విద్యార్థులు క్రీడారంగంలో సాంస్కృతిక రంగంలో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఎవరైనా బాలలచే పని చేపినట్లైతే అయితే1098 కి సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు వారి వెంట కరీంనగర్ జిల్లా బాలల హక్కుల ప్రజా వేదిక సమన్వయకర్త అబ్దుల్ కలీక్ తదితరులు పాల్గొన్నారు

