Friday, April 3, 2026

బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్

- Advertisment -

నేటి వారధి న్యూస్
చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది ఈఎన్కౌంటర్లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు మృతి చెందాలని బస్తర్ ఐజి పి సుందర్ రాజ్ తెలిపారు బీజాపూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. బీజపూర్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవరుజామున బీకర కాల్పులు జరగగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు ఈఘటనలో31 మంది మావోయిస్టులతోపాటు ఇద్దరు జవాన్లు మృతి చెందగా భారీ సంఖ్యలో మావోలు భద్రతా బలగాలు గాయపడ్డారు బీజాపూర్ లోని ఇంద్రావతి నేషనల్ పార్కు పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భేటీ జరుగుతున్న‌ట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో డీఆర్‌జీ సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌ ఎస్‌టీఎఫ్‌ కు చెందిన 3500 మంది బలగాలు యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి.ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు అక్కడిక్కడే హతం కాగా ఇద్దరు సైనికులు కూడా మృతి చెందినట్టు తెలిసింది అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య కూడా ఇంకా పెరగనుందని సమా చారం కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నా యని భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -