Friday, April 3, 2026

బ్రేకింగ్ న్యూస్ యూపీఐ పేమెంట్లతో లంచం  ఏసీబీ అదుపులో భద్రాచలం సీఐ

- Advertisment -

నేటి వారధి న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) బర్పటి రమేష్ లంచం కేసులో ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. గ్రావెల్ (మట్టికరువు) త్రవ్వకాలకు అనుమతి కోసం సీఐ 30,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
మూడు పక్షాల ఒప్పందం
బాధితుడు 25,000 రూపాయల మొత్తాన్ని గన్ మెన్ రామారావు ద్వారా మూడో వ్యక్తికి ఫోన్‌పే ద్వారా జమ చేశాడు. సీఐ డిమాండ్ మేరకు ఈ చెల్లింపు జరిగిందని బాధితుడు ఏసీబీ అధికారులకు స్పష్టమైన ఆధారాలతో నివేదించారు. పేమెంట్స్ వివరాలు, కాల్ రికార్డింగ్స్ లాంటి ఆధారాలను ఏసీబీ ఖమ్మం శాఖకు అందించారు సూక్ష్మ విచారణలో ఏసీబీ
లంచం ఇస్తేనే పనులు జరుగుతాయని, లేకుంటే పనులు ఆపేస్తానంటూ బెదిరింపులు చేసినట్టు బాధితుడు ఆరోపించారు ఇప్పటికే సీఐ రమేష్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని సమాచారం. గత ప్రభుత్వ హయాంలోనూ అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి
ప్రస్తుతం భద్రాచలం పోలీస్ స్టేషన్లోనే సీఐ బర్పటి రమేష్, గన్ మెన్ రామారావులను ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు.
ఏడాదిలో ఏడుగురు పోలీసులపై చర్యలు
కొద్ది నెలల క్రితం భద్రాచలం ఎస్‌ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ లను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ విభాగంలో ఏడాది వ్యవధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్లు ఏసీబీ వలలో చిక్కారు.మధ్యవర్తుల ముసుగులో అవినీతి
గన్‌మెన్‌లు, డ్రైవర్లు, ప్రైవేట్ వ్యక్తులను మధ్యవర్తులుగా ఉపయోగించి కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతున్న దుర్వినియోగం బయటపడుతోంది.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -